మళయాళ సినిమా బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరైన మోహన్ లాల్ హీరోగా పృథ్వీ రాజ్ సుకుమారన్ నటుడుగా అలాగే దర్శకునిగా కూడా చేసిన లేటెస్ట్ సాలిడ్ చిత్రమే “ఎంపురాన్”. తమ బిగ్గెస్ట్ హిట్ లూసిఫర్ కి సీక్వెల్ గా ఎల్ 2 ఈ ఎంపురాన్ పేరిట తెరకెక్కించిన ఈ సినిమాపై మళయాళ సినిమాలో ఏ చిత్రానికి లేని భారీ హైప్ నెలకొంది.
ఇలా బుకింగ్ ఓపెన్ చేసుకున్న ఈ చిత్రం కేవలం వీటితో రికార్డులు స్టార్ట్ చేసింది. గంటలో సహా డే 1 కి కూడా ఆల్ టైం హైయెస్ట్ నంబర్స్ సెట్ చేసిన ఈ చిత్రం ఇపుడు వీకెండ్ కి ఏకంగా 70 కోట్ల రేంజ్ బుకింగ్స్ ని వరల్డ్ వైడ్ గా నమోదు చేసుకున్నట్టు తెలుస్తుంది. దీనితో పాటుగా రిలీజ్ కి ముందు కూడా బుక్ మై షోలో 1 మిలియన్ కి పైగా బుకింగ్స్ ని నమోదు చేసిన తక్కువ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇలా మొత్తానికి ఎంపురాన్ హవా ఓ రేంజ్ లో ఉందని చెప్పాలి.