రజినీకాంత్ తో పాన్ ఇండియా నటుడు! ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తన కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ని గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ లాంటి ఇంటర్నేషనల్ లెవెల్ కటౌట్ నుంచి తన రేంజ్ సినిమా ఎపుడు పడుతుందా అని చూస్తున్న ఫ్యాన్స్ కి ఫైనల్ గా ఇపుడు సమయం వచ్చింది.
ఇక ఈ సూపర్ స్టార్ తో నటిస్తున్న మళయాళ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి షేర్ చేసుకున్న పిక్ ఇపుడు వైరల్ గా మారింది. పృథ్వీ రాజ్ కేవలం హీరోగానే కాకుండా తన దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ హిట్ చిత్రాలు కొన్ని ఉన్నాయి. వాటిలో మళయాళ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ తో చేసిన అవైటెడ్ సీక్వెల్ ఎంపురాన్ ఇపుడు రిలీజ్ రాబోతుంది.
మరి ఈ రిలీజ్ కి ముందు ఓజి సూపర్ స్టార్ రజినీకాంత్ తో జరిగిన ఓ ఘటనని షేర్ చేసుకున్నాడు. ఎంపురాన్ ట్రైలర్ చూసిన తర్వాత రజినీకాంత్ గారు చెప్పిన మాటలు ఎప్పటకీ తనకి గుర్తుంటాయి అని నేనెప్పటికీ మీ ఫ్యాన్ బాయ్ నే అంటూ ఎగ్జైటెడ్ పోస్ట్ ని తాను షేర్ చేసుకున్నాడు. దీనితో తన పోస్ట్ ఇపుడు వైరల్ గా మారింది.