చరణ్‌,నీల్‌ సినిమా పై సాలిడ్‌ బజ్‌!

చరణ్‌,నీల్‌ సినిమా పై సాలిడ్‌ బజ్‌! ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో భారీ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా చరణ్ కెరీర్లో 16వ సినిమాగా చేస్తుండగా ఈ చిత్రంపై సాలిడ్ హైప్ అయితే నెలకొంది. 

ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఎగ్జైటెడ్ గా కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా తర్వాత చరణ్ లైనప్ లో దర్శకుడు సుకుమార్ తప్ప ఇంకో దర్శకుడు పేరు ప్రస్తుతానికి లేదు. కానీ లేటెస్ట్ గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు వినిపిస్తోంది. ఈ కాంబినేషన్ కోసం కూడా చాలా మంది ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు. 

దీనితో ఈ భారీ కలయికలో అతి త్వరలోనే అనౌన్స్మెంట్ కూడా రావచ్చని టాక్. అలాగే ఈ సినిమాని చరణ్ తో RRR లాంటి సెన్సేషనల్ సినిమా చేసిన డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు చేయనున్నట్టుగా టాక్. మరి ఈ క్రేజీ కలయికపై మరింత సమాచారం రావాల్సి ఉంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories