జగన్ దళాల చవకబారు అజ్ఞాన ప్రచారం!

అసత్యాలకు మసిపూసి మారేడు కాయ చేస్తూ ప్రత్యర్థుల మీద విషప్రచారానికి తెగబడడం రాజకీయాల్లో కొత్త సంగతి కాదు. కానీ.. అలాంటి అసత్య ప్రచారాల్లో కూడా ఎంతో కొంత ఔచిత్యం లేకపోతే.. అలాంటి తప్పుడు పనిచేసేవారి పరువే పోతుంది. ప్రభుత్వాలు ఒక సంకల్పం కోసం పనిచేస్తున్నప్పుడు.. ఆ సంకల్పానికి ప్రజల్లో ఆదరణ కూడా ఉన్నప్పుడు.. ప్రజలందరికీ విపులంగా అర్థమైన వాస్తవాలను కూడా మరుగున పెట్టే కుట్ర చేస్తూ.. అసత్య విషప్రచారాలకు పాల్పడితే.. ప్రజలు ఖచ్చితంగా వారిని ఈసడించుకుంటారు. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అలాంటి దుర్మార్గానికే పాల్పడుతోంది. ప్రజలు తమను అసహ్యించుకుంటారనే వెరపు కూడా లేకుండా.. వారు తాము సాగించదలచుకున్న దుష్ప్రచారంతోనే ముందుకెళుతుండడం గమనార్హం.

అమరావతి నిర్మాణాల కోసం రాష్ట్రప్రభుత్వం 9 నెలల్లో 52వేల కోట్ల రూపాయల అప్పు చేసిందట. ఈ అప్పులను ఎలా తీరుస్తారు? ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం కాదా? అని వైఎస్సార్ కాంగ్రెస్ దళాలు ప్రశ్నిస్తున్నాయి. వారి కరపత్రికలు, చానెళ్లు కోళ్లయి కూస్తున్నాయి. ఈ అప్పులను ఎలా తీరుస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ఖజానాకు భారం పెంచుతున్నారని విమర్శిస్తున్నారు. అయితే ఇలాంటి విమర్శల ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ దళాలు తమ అజ్ఞానాన్ని చాటుకుంటున్నాయే తప్ప మరొకటి కాదని ప్రజలు విమర్శిస్తున్నారు.

అమరావతి రాజధాని నగర నిర్మాణం అనేది సెల్ఫ సస్టయినబుల్ ప్రాజెక్ట్ అనేది ప్రభుత్వం ఎప్పటినుంచో చెబుతోంది. చంద్రబాబునాయుడు తొలినుంచి దీనిపై అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. కానీ వైసీపీ అజ్ఞానులకు అది అర్థమైనట్లు లేదు. అమరావతి నిర్మాణానికి ఇబ్బడి ముబ్బడిగా రుణసదుపాయం ఏర్పాటు అవుతుండడం, ఏప్రిల్ లో పనులు పునఃప్రారంభం అయితే.. అసలు బ్రేక్ పడే అవకాశమే లేకుండా జోరుగా సాగిపోయే పరిస్థితి ఉండడంతో జగన్ దళాలు ఓర్వలేకపోతున్నాయి.  తాజాగా హడ్కో 11 వేల కోట్ల రూపాయల రుణం ఇవ్వడానికి ఒప్పందం చేసుకోగానే వారికి కన్నుకుట్టింది. ఇప్పుడు అప్పులు ఎలా తీరుస్తారంటూ విషం చల్లుతున్నారు.
నిజానికి సెల్ఫ్ సస్టయినబుల్ ప్రాజెక్ట్ అంటే ఏమిటో మంత్రినారాయణ కొన్ని రోజుల కిందట చాలా విపులంగా చెప్పారు. ప్రతిపాదిత ప్రభుత్వ, ప్రెవేటు నిర్మాణాలు అన్నీ అమరావతిలో చేపట్టిన తరువాత కూడా.. ప్రభుత్వం వద్ద నాలుగువేల ఎకరాలకు పైగా స్థలం మిగిలిఉంటుందని ఆయన అన్నారు. అప్పటికి నగరనిర్మాణం పూర్తయి ఉంటుంది గనుక.. స్థలాల విలువ కూడా బాగా పెరిగి ఉంటుందని.. ఆ స్థలాలను విక్రయించడం ద్వారా వచ్చే సొమ్ములను అప్పులు తీర్చడానికి వాడుతామని మంత్రి నారాయణ చెప్పారు. ఇది చాలా సింపుల్ గా కనిపిస్తున్న సూత్రం. ఇది కూడా అర్థం చేసుకోలేకపోతే వైసీపీ నేతలది అజ్ఞానం కాక మరేమిటని అనుకోవాలి? అమరావతి ఏకైక రాజధానిగా రాష్ట్రానికి కావాలనే సదుద్దేశంతోనే ప్రజలందరూ కూటమి ప్రభుత్వాన్ని అఖండ మెజారిటీతో గెలిపించారు. మూడురాజధానులు అంటూ జగన్ ఆడిన డ్రామాలను తిప్పికొట్టారు. కేవలం దుర్బుద్ధితో అమరావతి మీద విషం చిమ్మాలని చూస్తే వైసీపీని మరింతగా అసహ్యించుకుంటారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories