జగన్ చేసిన నష్టానికి మూడురెట్ల దిద్దుబాటు!

రాష్ట్రంలో అసలు ఎక్కడా చంద్రబాబునాయుడు ముద్ర అనేదే కనపడకుండా చేయాలనే దురుద్దేశంతో.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అయిదేళ్ల విలువైన పాలన కాలాన్ని కేటాయించాడు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి చంద్రబాబు ఏ చర్యలు తీసుకున్నా సరే.. వాటిని రూపు మాపేయడానికి.. మొగ్గదశలోనే తుంచేయడానికి తాపత్రయపడ్డారు. అమరావతి రాజధాని స్వప్నాన్ని మరుభూమిగా మార్చి చిదిమేయడం దగ్గరినుంచి .. విశాఖలో ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్న లులు మాల్ ను వెనక్కి తరిమికొట్టడం వరకు జగన్ నానా దుశ్చర్యలకు పాల్పడ్డారు. అయితే.. అప్పుడు ఆయన చేసిన నష్టాలను పూడ్చడమే పనిగా కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్న సంగతి అందరికీ తెలుసు. లులు మాల్ విషయంలో జగన్ చేసిన ఒక నష్టానికి మూడు రెట్లుగా నివారణ చర్యలు చేపట్టేందుకు చంద్రబాబు ఇప్పుడు సిద్ధం అవుతున్నారు. విశాఖపట్నంలో లులు మాల్ ఏర్పాటుకు తాజాగా కేబినెట్ ఆమోద ముద్ర వేయగా.. అమరావతి, తిరుపతి నగరాల్లో కూడా లులు మాల్స్ ఏర్పాటుకు లులు సంస్థ సిద్ధంగా ఉన్నట్లు చంద్రబాబు వెల్లడించారు.

2014 తర్వాత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు.. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లులు మాల్ ను విశాఖలో ఏర్పాటుచేసేందుకు వారికి స్థల కేటాయింపులు చేశారు. వారు తమ కార్యకలాపాలను ప్రారంభించేలోగానే రాష్ట్రంలో అధికారం మారింది. లులుకు కేటాయించిన స్థలాన్ని జగన్ సర్కారు వెనక్కి లాక్కుని, ఆ సంస్థను వెళ్లగొట్టింది. ఆ పిమ్మట హైదరాబాదులో లులు ఏర్పాటు అయింది. ఈ చేదు అనుభవంతో ఇంకెప్పుడూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టబోం అని లులు సంస్థ ప్రకటించింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. చంద్రబాబునాయుడు మళ్లీ ఈ దిశగా ప్రయత్నాలు చేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు లులును ఒప్పించారు. విశాఖలో మాల్ ఏర్పాటుకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఇటీవల అనుమతులు తెలిపింది. ప్రస్తుతం దానికి కేబినెట్ ఆమోదం కూడా లభించింది.

లులు మాల్ ఏర్పాటు వలన వందల వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఇవాళ్టి రోజుల నగర జీవనంలో మాల్స్ కీలకంగా మారిపోతున్నాయి. అన్ని రకాల వస్తువులు, దినుసులు, సేవలు పౌరులకు అవసరమైన సమస్తం.. ఒకే ప్రాంగణంలో అందుబాటులో ఉండడం అనేది నగర ప్రజల జీవన శైలిని సులభతరం చేస్తుంటుంది. అసలే ఒత్తిడి మధ్య ఉండే నగరపౌరులకు సమయం కూడా ఎంతో ఆదా అవుతూ ఉంటుంది. ఈ విశాల ప్రయోజనాలు అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని చంద్రబాబునాయుడు లులు మాల్ ను విశాఖకు తీసుకువస్తే.. జగన్ దానిని వెళ్లగొట్టడం జరిగింది. అప్పుడు జగన్ చేసిన నష్టానికి మూడు రెట్లుగా ఇప్పుడు మళ్లీ నివారణ చర్యలు చంద్రబాబు చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories