ఎస్‌ఎస్‌ఎంబీ 29 డిప్యూటీ సీఎం లీక్‌!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ SSMB29 కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో క్రియట్ అయ్యాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. అయితే, ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ షూటింగ్‌పై డిప్యూటీ సీఎం లీక్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం ఒడిశా రాష్ట్రంలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. అయితే, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం ప్రవతి పరిద ఈ చిత్ర షూటింగ్‌పై సోషల్ మీడియా గురించి ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. గతంలో ‘పుష్ప-2’.. ఇప్పుడు SSMB29 చిత్రాలు ఒడిశాలో షూటింగ్ జరుపుకోవడం ఆనందంగా ఉంది. ఇక్కడ సినీ పరిశ్రమకు కావాల్సిన అన్ని సినిమాటిక్ స్థలాలు చాలా ఉన్నాయనేందుకు ఇది నిదర్శనం.. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం కోరాపుట్‌లో మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రాలు పాల్గొంటున్నారని ఆమె తన ట్వీట్‌లో చెప్పుకొచ్చారు

అయితే, ఇప్పటివరకు ఈ షూటింగ్‌లో కేవలం మహేష్, పృథ్వీరాజ్ మాత్రమే ఉన్నారని అందరూ భావించారు. కానీ, డిప్యూటీ సీఎం లీక్‌తో ఇప్పుడు ఈ షూటింగ్‌లో ప్రియాంక చోప్రా కూడా ఉందని తేలిపోయింది.

Related Posts

Comments

spot_img

Recent Stories