ఫ్యాన్స్ ఆందోళన!

ఫ్యాన్స్ ఆందోళన! ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్‌తో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాడు. ఇక బాక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్స్‌తో ఈ మూవీ అదరగొట్టింది. ఇక ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు బన్నీ రెడీ అవుతున్నాడు. 

తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లో బన్నీ తన నెక్స్ట్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే, ఈ సినిమాపై రోజుకో వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. తాజాగా వినిపిస్తున్న ఓ వార్త అభిమానుల్లో ఆందోళన క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకు వచ్చినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. 

అయితే, ఈ సినిమా కోసం దర్శకుడు అట్లీ ఏకంగా రూ.100 కోట్ల భారీ రెమ్యునరేషన్ కోట్ చేస్తున్నాడని.. దీంతో ఈ నిర్మాణ సంస్థ వెనకడుగు వేస్తుందనే వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. దీంతో ఇప్పుడు ఈ సినిమాను ఎవరు ప్రొడ్యూస్ చేస్తారనే అయోమయం నెలకొంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్, అట్లీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories