వార్నర్‌ ఎంట్రీ ..మామూలుగా లేదుగా!

టాలీవుడ్ సినిమా దగ్గర విడుదలకి వస్తున్న తాజా సినిమాల్లో యూత్ స్టార్ నితిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన తాజా సినిమా  “రాబిన్ హుడ్” కూడా ఓ మూవీ. అయితే ఒక సాలిడ్ ఎంటర్టైనర్ లా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ చిత్రంతోనే ప్రముఖ ఆస్ట్రేలియన్ డాషింగ్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

వార్నర్ మన తెలుగు ఆడియెన్స్ కి ఎంత దగ్గరయ్యాడు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టిక్ టాక్ ఉన్న సమయంలో అల్లు అర్జున్, మహేష్ బాబు అలాగే ప్రభాస్ లాంటి స్టార్స్ పై పలు వీడియోలు చేసి తెలుగు ఆడియెన్స్ కి ఎంతో దగ్గరయ్యాడు. అలాగే డేవిడ్ వార్నర్ అక్కడ నుంచి తెలుగు సినిమా ఎంట్రీ కూడా ఇస్తే బాగుండు అని చాలా మంది ఎదురు చూసారు.

అయితే ఫైనల్ గా రాబిన్ హుడ్ తో తాను తెలుగు ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తున్నారు. అయితే లేటెస్ట్ గా మేకర్స్ వార్నర్ ని సినిమా ప్రమోషన్స్ లో కూడా జాయిన్ చేస్తామని చెప్పడం మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. దీనితో తన డెబ్యూ సినిమాకి మాత్రం వార్నర్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని చెప్పొచ్చు. వార్నర్ కావాలంటే జస్ట్ యాక్ట్ చేసి ప్రమోషన్స్ ని మిస్ చెయ్యొచ్చు కానీ సినిమా కోసం వచ్చి పాల్గొనబోవడం అనేది ఒకింత స్పెషల్ అనే చెప్పాలి. ఇది మాత్రం రాబిన్ హుడ్ కి మరింత బూస్టప్ ని ఇవ్వొచ్చు.  

Related Posts

Comments

spot_img

Recent Stories