అలాంటి టైటిల్‌ని ఫిక్స్‌ చేశాడా!

అలాంటి టైటిల్‌ని ఫిక్స్‌ చేశాడా! మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ చిత్రం ‘వార్-2’ షూటింగ్ చివరిదశలో ఉన్న ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో భారీ పాన్ ఇండియా చిత్రాన్ని స్టార్ట్ చేశాడు. ఈ రెండు సినిమాలతో అభిమానులకు మాస్ ఫీస్ట్ ఇచ్చేందుకు ఎన్టీఆర్ సిద్ధమవుతున్నాడు. 

ఇక ప్రశాంత్ నీల్ సినిమాను ఈ ఏడాది చివరినాటికి ముగించేయాలని తారక్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే, ఈ రెండు సినిమాల తర్వాత ఎన్టీఆర్‌తో తమిళ దర్శకుడు నెల్సన్ ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ కూడా కొన్ని సందర్భాల్లో రివీల్ చేశారు. అయితే, ప్రస్తుతం ‘జైలర్-2’ సినిమాను తెరకెక్కిస్తున్న నెల్సన్, ఈ సినిమా ముగిసిన తర్వాత ఎన్టీఆర్‌తో ఓ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్‌టైనర్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 

పాన్ ఇండియా చిత్రంగా రాబోతున్న ఈ సినిమాకు ‘ROCK’ అనే టైటిల్‌ను నెల్సన్ అనుకుంటున్నాడట. పాన్ ఇండియా మూవీగా రానున్న ఈ చిత్రాన్ని ఇలాంటి యూనివర్సల్ టైటిల్ పర్ఫెక్ట్‌గా సరిపోతుందని ఆయన భావిస్తున్నాడు. ఇక ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేయనుంది. మరి నిజంగానే ఎన్టీఆర్ కోసం ‘రాక్’ టైటిల్‌ను ఫిక్స్ చేస్తారా అనేది వేచి చూడాలి. ఈ సినిమాను దర్శకుడు అరుణ్ ప్రభు డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలో గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories