విశ్వంభర వర్సెస్‌ వీరమల్లు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా సినిమా ‘హరిహర వీరమల్లు’ చివరి షెడ్యూల్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఈ సినిమాను డైరెక్టర్ జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి పీరియాడికల్ మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అవుతుంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తన పాత్రలో ప్రేక్షకులను స్టన్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

అయితే, ఈ సినిమాను మార్చి 28న గ్రాండ్ విడుదల చేస్తామని గతంలో చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేశారు. కానీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, ఈ సినిమా అనుకున్న డేట్‌కు రావడం కష్టం అనిపిస్తుంది. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, మే 9న మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రం విడుదల అవ్వాల్సి ఉంది. కానీ, ఆ సినిమా కూడా అనుకున్న తేదీకి రావడం లేదు. దీంతో ఇప్పుడు వీరమల్లు ఆ ప్లేస్‌లో రావాలని చూస్తున్నాడు.

మే 9న హరిహర వీరమల్లు విడుదల తేదీ ఫిక్స్ చేసుకుంటే, వేసవి బరిలో భారీ చిత్రాల రేసులో ఈ మూవీ ముందుగా రానుంది. మరి మే 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారా.. లేక వేరే ఏదైనా డేట్‌ను ఫిక్స్ చేస్తారా అనేది చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories