గోపిచంద్‌ కోసం సంకల్ప్ రెడ్డి!

మ్యాచో స్టార్ గోపీచంద్ తన కెరీర్‌లోని 33వ మూవీని డైరెక్టర్‌ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ప్రారంభించాడు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా నిర్వహించారు. ఇక ఈ సినిమాతో గోపీచంద్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేయనున్నాడు.

కాగా, ఈ సినిమాకు సంబంధించి తాజాగా సినీ సర్కిల్స్‌లో ఓ ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా నేపథ్యం 7వ శతాబ్దానికి చెందినదిగా ఉండబోతుందని.. ఇదొక హిస్టారికల్ ఎపిక్ మూవీగా రాబోతుందని తెలుస్తోంది. అయితే, దర్శకుడు సంకల్ప్ రెడ్డి తన గత చిత్రాలను పంచభూతాల నేపథ్యంలో తెరకెక్కించాడు. ఘాజీ, అంతరిక్షం, ఐబి 71 చిత్రాలలో మూడు భూతాలను టచ్ చేసిన సంకల్ప్, ఇప్పుడు గోపీచంద్ చిత్రంలో నిప్పు నేపథ్యంలో తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది

ఇలా పంచభూతాలను వదలని దర్శకుడిగా సంకల్ప్ రెడ్డి మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా అయ్యాడు. ఇక ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ప్రొడ్యూస్ చేయనున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories