వారు అనుమానించారు! బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ – కిరణ్‌రావు దంపతులు తమ వివాహ బంధానికి ముగింపు పలికిన విషయం తెలిసిందే. వ్యక్తిగతంగా విడాకులు తీసుకున్నా వీరిద్దరు వృత్తిపరంగా ఇంకా కలిసి పని చేస్తున్నారు. ఐతే, తాజాగా కిరణ్ రావు.. పెళ్లికి ముందు నాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘‘నా డ్రీమ్స్ గురించి నా పేరెంట్స్ కు తెలుసు.
అందుకే ఆమిర్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు అనుమానం వ్యక్తం చేశారు. అమీర్ లాంటి ఫేమస్ పర్సన్‌ను పెళ్లి చేసుకుంటే.. ప్రొఫెషనల్‌గా నా ఐడెంటిటీ కోల్పోతానేమోనని నా పేరెంట్స్ భావించారు. ఐతే, అది కొంతవరకు నిజమే. పెళ్లి తర్వాత మళ్లీ నా సొంత గళం వినిపించేందుకు నాకు చాలా సమయం పట్టింది. అమీర్ నన్ను ప్రోత్సహించేవారు, ఆయన ఫ్యామిలీ కూడా నాతో ఆప్యాయంగా ఉండేది’ అని కిరణ్ రావు చెప్పుకొచ్చారు. కిరణ్ రావు ఇంకా మాట్లాడుతూ.. ‘మేము భార్యాభర్తలుగా విడిపోయినా ఒకరికి ఒకరం తోడుగా ఉంటాం. ఎప్పటికీ మాది ఒకటే కుటుంబం’ అని కిరణ్ రావు చెప్పుకొచ్చాడు.