హిస్టారికల్ డ్రామాతో వస్తున్న గోపిచంద్! యాక్షన్ హీరో గోపీచంద్, ఘాజీ ఫేమ్ దర్శకుడు సంకల్ప్ రెడ్డితో కలిసి ఒక ఉత్తేజకరమైన సరికొత్త ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేశారు. ఈ చిత్రం గోపీచంద్ సినీ కెరీర్ లో 33వ సినిమాగా రాబోతుంది.
కాగా నేడు హైదరాబాద్‌లో అధికారికంగా పూజా కార్యక్రమంతో నటీనటులు, చిత్ర బృందం మధ్య ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ అయింది. అన్నట్టు ఈ ప్రతిష్టాత్మక హిస్టారికల్ డ్రామా 7వ శతాబ్దంలో సాగనుంది. కాగా త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించబడుతుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పవన్ కుమార్ కూడా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.