నిజంగానే ‘అది దా సర్‌ప్రైజు’!

హీరో నితిన్ దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ‘రాబిన్‌హుడ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాను కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందిస్తుండటంతో చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు.

కాగా, ఈ సినిమాలో అందాల భామ కేతిక శర్మ ఓ స్పెషల్ పాటకు డ్యాన్స్‌ చేసింది. ‘అది దా సర్‌ప్రైజు’ అంటూ సాగే ఈ పాటను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ పాటకు చంద్రబోస్ క్యాచీ లిరిక్స్ అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ జి.వి.ప్రకాష్ కుమార్ మంచి పెప్పీ మ్యూజిక్‌తో ఈ పాటను కంపోజ్ చేసిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ముఖ్యంగా ఈ పాటలో కేతిక గ్లామర్ షో అండ్ ఆమె గ్రేస్‌తో చేసిన స్టెప్స్ హైలైట్‌గా ఉన్నాయి.

మొత్తంగా రాబిన్‌హుడ్ చిత్రంలో కేతిక డ్యాన్స్  ఆడియెన్స్‌కు నిజంగానే సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories