ఆ అలవాటు ఎప్పటికీ పోదు!

సినిమా ఇండస్ట్రీ అంటేనే మార్పుల మయం. పరిస్థితులకు తగ్గట్టు మార్పు సహజమే అనుకోక తప్పదు. ముఖ్యంగా హీరోయిన్‌లు అవకాశాలకు తగ్గట్లుగా మారుతూ ఉండాలి. అప్పుడే, వారు లైమ్ లైట్ లో ఉంటారు. ప్రస్తుతం కీర్తి సురేష్ పరిస్థితి కూడా అదే. పెళ్లి తర్వాత ఆమెలో ఆ మార్పు సహజమే అంటూ నెటిజన్లు కూడా పోస్ట్ లు చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ తన చిన్నతనం గురించి, అలాగే తన సినీ కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఇంతకీ, కీర్తి సురేష్ ఏమని కామెంట్స్ చేసింది అంటే.. ‘నేను నా చిన్న తనంలో చాలా అల్లరి పిల్లని అంట. నాకు చిన్నప్పుడు రూపాయి నాణేలు నోట్లో పెట్టుకోవడం బాగా అలవాటు. అలా రెండు సార్లు కాయిన్లు మింగేసా కూడా. ఆ రోజుల్లో ఆ అలవాటు మానేయడానికి నాకు చాలా సమయం పట్టింది. నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు మా ఇంట్లో నన్ను ఎవరైనా తిడితే, వాళ్ళు వాళ్ళ రూమ్ లో ఉన్నప్పుడు.. నేను సైలెంట్ గా వెళ్లి వాళ్ల రూమ్‌ బయట గడియ పెట్టేదాన్ని. 

ఈ విధంగా మా అమ్మను నేను చాలాసార్లు ఏడిపించాను. ఇప్పటికీ నాకు కోపం వస్తే అలాగే చేస్తా. బహుశా, ఆ అలవాటు నాకు ఇక పోదు అనుకుంటా. ఇక సినీ కెరీర్ విషయానికి వస్తే.. నా జీవితాన్ని మార్చేసిన మూవీ ‘మహానటి’’ అంటూ కీర్తి ఎప్పటి నుంచో చెబుతున్న విషయం తెలిసిందే.  

Related Posts

Comments

spot_img

Recent Stories