ఆ డైరెక్టర్ కి వెంకీ మామ పచ్చ జెండా! స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించి, వెంకీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీంతో ఇప్పుడు అందరి చూపు వెంకటేష్ నెక్స్ట్ మూవీపై పడింది. అయితే, తన నెక్స్ట్ చిత్రం కోసం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు ఈ స్టార్ హీరో. ఇప్పటికే పలువురు డైరెక్టర్ల కథలు వింటున్నాడు వెంకీ. కాగా, ఈ స్టార్ హీరో టాలీవుడ్‌లో స్టైలిష్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి చెప్పిన ఓ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
గతంలో సురేందర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాలను అందుకున్నాయో అందరికీ తెలిసిందే. ఈసారి ఓ పవర్‌ఫుల్ కథను రెడీ చేసిన ఆయన విక్టరీ వెంకటేష్‌కు వినిపించాడట. వెంకీ కూడా కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ రావచ్చని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.