టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ భామ! విభిన్నమైన చిత్రాలతో బాలీవుడ్ లో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సోనాక్షి సిన్హా తాజాగా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. హీరో సుధీర్ బాబు కెరీర్‌లో భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతున్న ‘జటాధర’ చిత్రంలో ఆమె ఓ కీలక పాత్రలో నటించబోతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం శనివారం స్పెషల్ పోస్టర్ ను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. అన్నట్టు ఈ సినిమాను వెంకట్ కళ్యాణ్ డైరెక్ట్ చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా ‘జటాధర’ సినిమా రాబోతుంది. వెంకట్ కల్యాణ్ రాసిన కథ చాలా కొత్తగా ఉందని, సినిమాలో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని తెలుస్తోంది. ప్రేరణ అరోరా సమర్పణలో సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ‘శాస్త్రీయ, పౌరాణిక అంశాల మేళవింపుతో ఈ కథ సాగుతుంది, అలాగే ఈ సినిమా రెండు జానర్స్‌కు చెందిన ప్రపంచాల్ని చూపించబోతుంది. మొత్తానికి వెండితెరపై చూస్తున్నప్పుడు ప్రేక్షకులకి ఓ సరికొత్త అనుభూతిని ఈ సినిమా ఇస్తోందట.