సాలిడ్ ఓపెనింగ్స్ అంతే! లేటెస్ట్ బాలీవుడ్ సినిమా దగ్గర వచ్చి సూపర్ హిట్ అయ్యిన చిత్రాల్లో విలక్షణ నటుడు విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన సాలిడ్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా “ఛావా”. అయితే ఈ సినిమా హిందీలో సంచలన ఓపెనింగ్స్ అందుకోగా అక్కడ రిలీజ్ అయ్యిన మొదటి రోజు నుంచే తెలుగులో సాలిడ్ డిమాండ్ నెలకొంది. ఇలా మొత్తానికి తెలుగులో రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం అనూహ్య రెస్పాన్స్ ని అందుకోవడం విశేషం. డే 1 కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి బుకింగ్స్ ని ఈ చిత్రం నమోదు చేస్తున్నట్టుగా ఆల్రెడీ తెలిపాము. మరి ఈ స్వింగ్ కి తగ్గట్టుగానే తెలుగు వెర్షన్ లో 3 కోట్ల మేర గ్రాస్ ని అందుకున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. దీనితో ఛావా పట్ల తెలుగు ఆడియెన్స్ ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇది ఖచ్చితంగా మన చరిత్ర, అందులోని శంభాజీ మహారాజ్ కే దక్కుతుంది అని చెప్పవచ్చు.