ఈ మూవీ నచ్చకపోతే ..ఆ సినిమాకి రావొద్దు!

ఈ మూవీ నచ్చకపోతే ..ఆ సినిమాకి రావొద్దు! న్యాచురల్ స్టార్ నాని తన ప్రొడక్షన్ హౌజ్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిన మూవీ ‘కోర్ట్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ తాజాగా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు పలువురు డైరెక్టర్స్‌తో పాటు హీరో నాని కూడా హాజరయ్యాడు. ఇక ఈ సినిమా ఈవెంట్‌లో నాని మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తెలుగు ప్రేక్షకులు ఇలాంటి మంచి చిత్రాన్ని తప్పకుండా చూడాలని ఆయన కోరాడు. ఇక ఈ సినిమా తనకు నిర్మాతగా కాకుండా ఓ ప్రేక్షకుడిగా బాగా నచ్చిందని.. అందుకే ప్రేక్షకులను ఈ సినిమా చూడాల్సిందిగా కోరుతున్నట్లు ఆయన అన్నారు. ఒకవేళ ‘కోర్ట్’ చిత్రం ప్రేక్షకులకు నిజంగా నచ్చకపోతే తన నెక్స్ట్ మూవీ ‘హిట్-3’ చూడొద్దంటూ నాని కామెంట్ చేశాడు. దీంతో అందరూ ఈ సినిమాపై నానికి ఎంత కాన్ఫిడెంట్ ఉందో అర్థం అవుతుందని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. కోర్ట్ చిత్రంలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్, రోహిణి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను రామ్ జగదీష్ డైరెక్ట్ చేయగా విజయ్ బుల్గనిన్ సంగీతం అందించారు. మార్చి 14న కోర్ట్ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories