ఓటీటీలోకి రామం రాఘవం ఎప్పుడంటే!

టాలీవుడ్‌లో కమెడియన్ ధన్‌రాజ్ ‘రామం రాఘవం’ మూవీతో డైరెక్టర్‌గా మారాడు. ఈ సినిమాలో విలక్షణ నటుడు సముద్రఖని, ధన్‌రాజ్ తండ్రీకొడుకులుగా నటించగా పూర్తి ఎమోషనల్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కింది. మంచి అంచనాలు మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ ఫిబ్రవరి 21న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఇక బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది.

అయితే, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్స్ట్ సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్రాన్ని మార్చి 14 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు సన్ నెక్స్ట్ తాజాగా వెల్లడించింది. థియేటర్లలో రిలీజ్ అయిన మూడు వారాల్లో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు రావడం విశేషం.

ఈ సినిమాలో సత్య, మోక్ష సేన్‌గుప్తా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. అరుణ్ చిలువేరు సంగీతం అందించిన ఈ చిత్రాన్ని పృథ్వి పోలవరపు ప్రొడ్యూస్ చేశారు. మరి ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories