ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర భారీ హైప్ నడుమ తెరకెక్కుతున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది డెఫినెట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో చేస్తున్న అవైటెడ్ ప్రాజెక్ట్ అనే చెప్పవచ్చు. మహేష్ బాబు కెరీర్లో చేస్తున్న 29వ సినిమా ఇది కాగా జక్కన్న ఈ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కిస్తున్నారు.
అయితే ఈ చిత్రంలో మళయాళ ప్రముఖ నటుడు మన తెలుగు ఆడియెన్స్ కి భారీ చిత్రం సలార్ తో దగ్గరైన స్టార్ పృథ్వీ రాజ్ సుకుమారన్ కూడా ఉన్నట్టుగా టాక్ ఉంది. అలాగే రీసెంట్ గానే తాను లుక్ మార్చడం తన భాష కాని కొత్త సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నా చెప్పడం వంటివి మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ కోసమే అని చాలా మంది అనుకున్నారు. అయితే ఈ సినిమాలో తాను కూడా ఉన్నారని ఇపుడు కన్ఫర్మ్ అయ్యిపోయింది.
లేటెస్ట్ గా మేకర్స్ ఒడిశాలో ఓ షెడ్యూల్ ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ షెడ్యూల్ లో మహేష్ సహా పృథ్వీరాజ్ కూడా జాయిన్ అయ్యినట్టుగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాయి. దీనితో ఈ బిగ్ ప్రాజెక్ట్ లో పృథ్వీ కూడా ఉన్నాడని ఇపుడు కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఇక మేకర్స్ అఫీషియల్ అనౌన్సమెంట్ ఇవ్వడం ఒకటే బాకీ అని చెప్పవచ్చు.