ఉచిత బస్సుపై జగన్‌కు కనీస జ్ఞానం లేదా?

చంద్రబాబునాయుడు తమ కూటమి ప్రభుత్వం ఏర్పాటైతే గనుక.. రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఆర్టీసలో ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి రావడానికి కీలంగా నిలిచిన సూపర్ సిక్స్ హామీలలో అది కూడా ఒకటి. సూపర్ సిక్స్ హామీలను ఒక్కటొక్కటిగా ప్రభుత్వంలో అమల్లోకి తెస్తోంది. ఉచిత బస్సు పథకం ఈ ఏడాది ఉగాది నుంచి అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ప్రకటించింది. ఆ హామీ పూర్తయినట్టే. అయితే పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. అసలు వార్తలు ఫాలో అవుతారో లేదో తెలియదు. సూపర్ సిక్స్ హామీలు ఏవీ అమలు కావడం లేదు అంటూ.. నానా గోల చేస్తూ ఉంటారు. ఆయన ఎన్నడో ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లో కంఠస్తం చేసిన పాయింట్లనే ఇప్పటికీ వల్లిస్తూ మీడియా ముందు బుకాయింపు కబుర్లుచెబుతుంటారు. తాజాగా ఆయన పెట్టిన ప్రెస్ మీట్ తో ఆయనలోని అజ్ఞానం మరొకసారి బయటపడిందని ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే.. చంద్రబాబునాయుడు 2023 మే నెల నుంచి సూపర్ సిక్స్ హామీల్లో ఉచిత బస్సు పథకం గురించి స్పష్టంగా చెబుతున్నప్పటికీ.. రెండేళ్లు గడుస్తున్నా.. ఆ పథకం గురించి.. జగన్ కు కనీసజ్ఞానం లేదని ప్రజలకు అర్థమవుతోంది. కనీసం బాబు ఇచ్చిన హామీ ఏమిటో కూడా గుర్తించకుండా.. బురదచల్లడమే తన జీవితలక్ష్యంగా బతికే మనిషి అసలు రాజకీయాలకు పనికొస్తాడా అని ప్రజలు అంటున్నారు.

తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం గురించి మరొకమారు మీడియా ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పడానికి.. తనకు నచ్చిన మీడియా సంస్థల వారిని మాత్రం పిలిపించుకున్న ప్రెస్ మీట్ పెట్టడం జగన్ కు అలవాటే. అలాంటి తాజా ప్రెస్ మీట్లో ఆయన చాలా నాటకీయంగా మాట్లాడారు. తమ పార్టీని భుజాన మోసే కీలక నటులు ఇప్పుడు జైలుపాలయ్యారని ఆవేదన చెందుతున్నారేమో.. వారి భాగం నటనను కూడా తానే ప్రదర్శిస్తూ.. ఉచిత బస్సు పథకం గురించి.. జగన్ పంచ్, వెటకారపు డైలాగులు వేసే ప్రయత్నం చేశారు.

ఉచిత బస్సు పెడితే విశాఖపట్నం వెళ్లి చూసొద్దామని మా రాయలసీమ మహిళలు ఎదురుచూస్తున్నారు. అమరావతి కడుతున్నారట.. విజయవాడకు వెళ్లి చూసొద్దామని మా రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు, విజయనగరం శ్రీకాకుళం జిల్లాల మహిళలు అనుకుంటున్నారని జగన్ ఎద్దేవా చేశారు. ఈ మాటలను గమనిస్తే.. అసలు ఉచిత బస్సు పథకం గురించి ఆయనకు ఏమీ తెలీదని అనిపిస్తోంది. ఎందుకంటే.. చంద్రబాబునాయుడు సూపర్ సిక్స్ లో భాగంగా.. ఉచిత బస్సు ప్రకటించినప్పుడే చాలా స్పష్టంగా ఒక సంగతి అన్నారు. ప్రతి మహిళకు వారి సొంత జిల్లా పరిధిలో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని మాత్రమే ఆయన చెప్పారు. అంతే తప్ప.. జగన్ భక్తులైన రాయలసీమ మహిళల్ని విశాఖపట్నం వెళ్లి… జగన్ కట్టించుకున్న రాజభవంతులను చూసిరమ్మనడానికి ఆయన ఈ పథకం తీసుకురాలేదు. చిన్న పనులు, వృత్తులు, ఉద్యోగాలు చేసుకునే సగటు మహిళలకు ఉపయోగంగా ఉండడానికి ప్రకటించారు. అంతే తప్ప.. విహార యాత్రలు చేసేవారికి కాదు. ఆ హామీ వచ్చి రెండేళ్లవుతున్నా జగన్ కు సంగతి తెలియదు. లేదా, తెలిసి కూడా.. తన తప్పుడు ప్రచారం ద్వారా ప్రజల్లో ఆశలు పెంచి చంద్రబాబు మీద అసంతృప్తి పుట్టించాలని అనుకుంటున్నారా? అనేది అర్థం కావడం లేదు. మొత్తానికి ఈ మాటల ద్వారా జగన్ తన అజ్ఞానాన్ని చాటుకున్నారని ప్రజలు భావిస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories