రికార్డు రెమ్యునరేషన్‌!

లేటెస్ట్ గా మన టాలీవుడ్ దగ్గర వచ్చి సెన్సేషన్ సెట్ చేసిన గ్లింప్స్ ఏదన్నా ఉంది అంటే అది నాచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “ది ప్యారడైజ్” కూడా ఒకటి. అయితే ఈ చిత్రం నుంచి వచ్చిన గ్లింప్స్ ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోగా ఇందులో సంగీత దర్శకుడు అనిరుద్ ఇచ్చిన స్కోర్ కూడా మంచి హైలైట్ గా మారింది.

అయితే ప్రస్తుతం సౌత్ లో ఉన్నటువంటి ఆల్ టైం టాప్ 3 సంగీత దర్శకుల్లో అనిరుద్ పేరు తప్పకుండా ఉంటుంది. తన పాటలు కంటే మెయిన్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కే ఆడియెన్స్ లో గట్టి డిమాండ్ కనిపిస్తుంది. దీనితో ఓ సినిమాకి సంగీతం అనిరుద్ అంటే దాని అంచనాలు మరో స్థాయికి కూడా చేరుకుంటున్నాయి.

ఇలా నెలకొన్న డిమాండ్ తోనే అనిరుద్ ది ప్యారడైజ్ కోసం రికార్డు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టుగా తెలుస్తుంది. గతంలో దేవర సినిమా టైం కే తాను 10 నుంచి 12 కోట్లు రెమ్యునరేషన్ గా ఒకో సినిమాకి తీసుకుంటున్నట్టుగా టాక్ వచ్చింది. కానీ ఇపుడు నాని సినిమాకి ఏకంగా 14 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్టుగా లేటెస్ట్ టాక్. మొత్తానికి అయితే ఇలా అనిరుద్ హవా సౌత్ లో ఓ రేంజ్ లో నడుస్తుంది అని చెప్పాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories