టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో స్వీటీ అనుష్క స్థానం వేరు అని అందరికీ తెలిసిందే. ఉన్న హీరోయిన్స్ అంతా వేరు అనుష్క వేరు. హీరోయిన్ గానే కాకుండా సోలో సినిమాలకి కూడా మంచి మార్కెట్ తనకి సొంతం. అయితే బాహుబలి సక్సెస్ తర్వాత తన ప్రాధాన్యత ఎక్కువ సినిమాలు తాను చేస్తుండగా ఇలా లేటెస్ట్ గా చేసిన అవైటెడ్ సాలిడ్ చిత్రమే “ఘాటీ”.
దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ చిత్రం కోసం అభిమానులు చాలా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ బాగానే అలరించాయి కానీ ఇపుడు రిలీజ్ దగ్గరకి వస్తున్నప్పటికీ మేకర్స్ మౌనంగా ఉండడం అనేది ఫ్యాన్స్ లో టెన్షన్ గా మారింది. అయితే మేకర్స్ సహా అనుష్క ఈ సినిమా ప్రమోషన్స్ ని ఈ మార్చ్ మిడ్ నుంచి లేదా ఆ తర్వాత నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. మరి దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.