ఆపేస్తున్నారా!

సెంట్ గా మళయాళ సినిమా నుంచి రిలీజ్ కి వచ్చిన సాలిడ్ వైలెంట్ యాక్షన్ డ్రామా చిత్రం “మార్కో” కోసం అందరికీ తెలిసిందే. మళయాళ సినిమా దగ్గర మాత్రమే కాకుండా తెలుగు సహా హిందీ మార్కెట్ లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లు అందుకుంది. అయితే ఈ చిత్రంలో భయంకరమైన వైలెన్స్ పట్ల చాలానే కామెంట్స్ వచ్చాయి.

టెక్నీకల్ గా నాచురాలిటీ పక్కన పెడితే దర్శకుడు హనీఫ్ అదేని చూపించిన వైలెన్స్ మాత్రం దారుణంగా అనిపించింది. దీనితో చాలా మంది ఈ సినిమాపై ప్రశంసలు కురిపించినవారు ఉన్నారు అలాగే తిట్టుకున్నవారు కూడా ఉన్నారు. అయితే రీసెంట్ గానే ఓటిటిలో రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఇపుడు టెలివిజన్ ప్రీమియర్ కి కూడా రావాల్సి ఉంది.

కానీ సి బి ఎఫ్ సి(సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) వారు ఈ చిత్రం టీవీ ప్రీమియర్ కి అడ్డు చెప్పినట్టు తెలుస్తుంది. ఇలాంటి వైలెన్స్ సినిమా స్మాల్ స్క్రీన్ పై టెలికాస్ట్ చేయొద్దని ఆపేసారట. దీనితో మార్కో టీవీ ప్రీమియర్ ఆగిపోయింది. ఇక దీనితో పాటుగా ఓటిటిలో కూడా ఈ సినిమా త్వరలోనే తొలగించేస్తారు అన్నట్టు కూడా పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Related Posts

Comments

spot_img

Recent Stories