తాజా సమాచారం ఏంటంటే!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో ఒక ఒక గ్లోబల్ అడ్వెంచరస్ డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసం ఎన్నో ఏళ్ళు నుంచి మహేష్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇపుడు ఫైనల్ గా సినిమా పట్టాలెక్కి శరవేగంగా షూటింగ్ జరుపుతుంటుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి ఓ భారీ సెట్టింగ్ అంటూ ఓ పిక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కానీ ఇపుడు షూటింగ్ పై లేటెస్ట్ న్యూస్ తెలుస్తుంది. దీనితో మేకర్స్ ఇపుడు కొత్త షెడ్యూల్ నిమిత్తం ఒడిశాకి వెళ్లనున్నారట. అక్కడ కోరాపుట్ పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలని తెరకెక్కించనున్నారని తెలుస్తుంది. ఈ షెడ్యూల్ రేపు మార్చ్ 6 నుంచి మొదలు కానుంది. ఇక ఈ భారీ ప్రాజెక్ట్ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories