ఒక్క గ్లింప్స్‌ అంతే!

ఒక్క గ్లింప్స్‌ అంతే! నేచురల్ స్టార్ నాని హీరోగా “దసరా” అనే సినిమా ఎప్పుడైతే చేసాడో అక్కడ నుంచి తన వెర్షన్ 2.0 ని చూపించాడు అని చెప్పాలి. వినూత్న సినిమాలు అంతకు మించిన మేకోవర్స్ తో నాని ఊహించని ట్రీట్ అందిస్తున్నాడు. అయితే రీసెంట్ గా వచ్చిన హిట్ 3 కే అనుకుంటే ఇపుడు ది ప్యారడైజ్ తో సంచలనమే సెట్ చేసాడు అని చెప్పాలి. 

దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఊహించని మేకోవర్ అలాగే ఊహించని డైలాగ్స్ తో ఈ గ్లింప్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. దీనితో ఇపుడు తెలుగు యువత అంతా ఈ గ్లింప్స్ కోసమే మాట్లాడుకుంటున్నారు. ఇలా పాజిటివో నెగిటివో.. ప్రస్తుతం మాత్రం ది ప్యారడైజ్ ఓ రేంజ్ లో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. మరి సినిమా కూడా ఇదే రేంజ్ లో ఉంటే భారీ వసూళ్లు సొంతం అవుతాయి అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఎస్ ఎల్ వి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories