వెంకీ మామ కొత్త రికార్డు!

వెంకీ మామ హీరోగా ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన సెన్సేషనల్ హిట్ చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం” కోసం అందరికీ తెలిసిందే. రీజనల్ గా ఆల్ టైం రికార్డు వసూళ్లు అందుకున్న ఈ చిత్రం రీసెంట్ గానే 50 రోజులు రన్ ని పూర్తి చేసుకోవడం అలాగే ఓటిటిలోకి రావడం కూడా జరిగింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు జీ5 వారు సొంతం చేసుకోగా అందులో పాన్ ఇండియా ఎంట్రీ ఈ చిత్రం ఇచ్చింది.

ఇక అక్కడ రావడంతోనే ఓటిటిలో కూడా ఆల్ టైం రికార్డు వ్యూస్ ని అందుకోగా ఇపుడు మరో హిస్టరీ సెట్ చేసినట్టుగా మేకర్స్ చెబుతున్నారు. ఇలా సంక్రాంతికి వస్తున్నాం చిత్రం 48 గంటల్లో ఏకంగా 200 మిలియన్ కి పైగా స్ట్రీమింగ్ మినిట్స్ ని నమోదు చేసినట్టుగా చెబుతున్నారు. దీనితో ఓటిటిలో కూడా కొత్త రికార్డ్స్ తో ఈ సినిమా అదరగొడుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా దిల్ రాజు, శిరీష్ లు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories