రవితేజ చార్ట్ బస్టర్ రీమిక్స్?

టాలీవుడ్ సీనియర్ హీరోస్ లో మోస్ట్ ఎనర్జిటిక్ హీరో మాస్ మహారాజా రవితేజ కోసం అందరికీ తెలిసిందే. జెట్ స్పీడ్ లో సినిమాలు కంప్లీట్ చేస్తూ ఆడియెన్స్ ని నిరంతరం ఎంటర్టైన్ చేసేందుకు తాను ముందుంటారు. అయితే రవితేజ ఇపుడు హీరోగా నటిస్తున్న అవైటెడ్ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రమే “మాస్ జాతర”.

దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. మెయిన్ గా వింటేజ్ రవితేజని మళ్ళీ విట్నెస్ చెయ్యడంతో అభిమానులు మరింత ఎగ్జైట్ అయ్యారు. అయితే ఈ చిత్రంపై మరో క్రేజీ బజ్ ఇపుడు వైరల్ గా మారింది. ఈ చిత్రంకి భీమ్స్ అందిస్తుండగా భీమ్స్ ని కూడా రవితేజ పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

వీరి నడుమ ట్రాక్ రికార్డు కూడా ఓ రేంజ్ లో ఉంది. అయితే వీరు ఇపుడు రవితేజ కెరీర్లో మాస్ హిట్ “ఇడియట్” సినిమా నుంచి చూపుల్తో గుచ్చి సాంగ్ ని రీమిక్స్ చేయనున్నారు అంటూ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories