ప్రస్తుతం మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “విశ్వంభర” గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత చిరు నుంచి మరిన్ని సాలిడ్ ప్రాజెక్ట్ లు రాబోతున్నాయి. అయితే వీటిలో యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ప్లాన్ చేస్తున్న సినిమా కూడా ఒకటి.
కాగా ఇది అనౌన్స్ చేసినప్పుడే భారీ హైప్ నెలకొంది కానీ ఇపుడు నాచురల్ స్టార్ నానితో “ది ప్యారడైజ్” సినిమా గ్లింప్స్ చూసాక మెగాస్టార్ తో ఆ రక్తపాతం ఎలా ఉండబోతుందో అనేది మరింత లెవెల్ కి ఆలోచించేలా చేస్తుంది. దీనితో చిరు ఓదెల ప్రాజెక్ట్ కోసం మెగా అభిమానులు మరింత ఎగ్జైట్ అవుతున్నారు. మరి చూడాలి ఈ చిత్రం ఎలాంటి సెన్సేషన్ ని సెట్ చేస్తుంది అనేది. ఇక ఈ అవైటెడ్ కాంబినేషన్ ప్యారడైజ్ కంప్లీట్ అయ్యాక మొదలు కానుంది.