వైసీపీ వాళ్లను పాముతో పోలిస్తే తప్పెలా?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి దళాలకు నిత్యం చంద్రబాబునాయుడు మీద విషం చిమ్ముతూ ఉండడమే పని! మసిగుడ్డ కాల్చి మొహాన పడేస్తే వాళ్లే కడుక్కుంటార్లే అనేది వారి గేమ్ ప్లాన్. జగన్ కుయుక్తులకు, ఆయన నీలిదళాల దుర్మార్గాలకు ఆయన కరపత్రిక, చానెల్ కూడా తోడు ఉంటాయి. వాళ్లంతా కలిసి ఇప్పుడు కొత్త ప్రచారం సాగిస్తున్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. వైసీపీ వారికి పనులు చేసి పెడితే ఊరుకునేది లేదంటూ అధికారులను హెచ్చరించారట. వారికి పనులు చేస్తే పాముకు పాలు పోసినట్టే అని అన్నారుట! ఆ మాటలను పట్టుకుని.. చంద్రబాబు ను నిందించడానికి నీలిదళాలు సాహసిస్తున్నాయి. జగన్ మాటలను పోల్చి జగన్ మహానుభావుడు, దేవుడు అన్నట్టుగా కీర్తిస్తున్నాయి. వారి పోలికలు- మాటలు అన్నీ సత్యదూరాలు. వక్రమైన మాటలు, సంబంధంలేని విషయాలను పోల్చి చెప్పడంగా సాగుతున్నది అని ప్రజలు గుర్తిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ వారిని పాముతో పోలిస్తే అసలు తప్పేంటి అని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఇంతకూ జగన్ దళాల గోల ఏంటంటే.. ‘సంక్షేమ పథకాల విషయంలో కులమతాలు చూడకుండా, పార్టీలు చూడకుండా అర్హులందరికీ ఇస్తాం’ అని జగన్ గతంలోు స్టేట్ మెంట్ ఇచ్చారట. ఆ మాట చెప్పినందుకు ఆయనను దేవుడిలాగా ఆయన కరపత్రిక కీర్తిస్తున్నది. అయితే.. గోముఖ వ్యాఘ్రాల్లాగా.. పైకి ఇలాంటి నంగనాచి మాటలు చెబుతూ లోలోన చేసిన దురాగతాలు గత అయిదేళ్లలో ప్రజలు బాగా చూశారు. వీరి కరపత్రికల్లో  ఎలాగైనా డప్పు కొట్టుకోవచ్చు గానీ.. అర్హతల ముసుగులో ఎవరెవరికి ఎగ్గొట్టారో  ప్రజలకు తెలుసు. తెలుగుదేశం జనసేనపార్టీల సానుభూతి పరులను టార్గెట్ చేసి మరీ ఏరివేశారు. న్యాయబద్ధంగా అందవలసిన సంక్షేమపథకాలకు కూడా వారిని దూరం చేశారు.

కానీ.. ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే.. చిత్తూరు జిల్లా కార్యక్రమంలో చంద్రబాబునాయుడు ప్రకటించినది సంక్షేమ పథకాల సంగతి కాదు. కాంట్రాక్టులు, దళారీ, పైరవీ పనుల గురించి మాత్రమే! జగన్ పాలనలో స్థానికంగా అధికార్లను, ప్రభుత్వకార్యాలయాల్లో సిబ్బందిని లోబరచుకుని.. వారిద్వారా పైరవీలు చేస్తూ దళారీపనులతో దందాలు చేయడంలో చెలరేగిపోయిన వైసీపీ కిందిస్థాయి నాయకులు.. అప్పటి పరిచయాలతో ఇప్పటికీ ప్రజలను అలాగే దోచుకుంటున్నారు. అలాంటి దోపిడీ పర్వానికి చెక్ పెట్టడం గురించి మాత్రమే చంద్రబాబునాయుడు చెప్పినట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే వైసీపీ అనుకూల వ్యక్తులు అధికార్లను ప్రలోభపెట్టి అడ్డదారుల్లో ప్రభుత్వ సొమ్మును దోచుకోవడానికి అనేక రకాల వక్రమార్గాలను గత అయిదేళ్లలో అలవాటు చేసుకున్నారు. టీడీఆర్ బాండ్ల వంటివి ఇందుకు పెద్ద ఉదాహరణ. పనులు చేయకుండానే.. కాంట్రాక్టుల బిల్లులు పొందడం, లేని పనులకు కాంట్రాక్టులు పొందడం లాంటివి ఎన్నో. అధికారుల్ని గుప్పిట్లో పెట్టుకుని.. ఇవే అరాచకాల్ని కొనసాగిస్తున్న వారు ఎందరో ఉన్నారు. వారి ఆటకట్టించడానికి చంద్రబాబు ఈ మాటలు చెప్పారే తప్ప.. జగన్మోహన్ రెడ్డి తరహాలో నంగనాచి మాటలు కాదని పార్టీ వర్గాలు అంటున్నాయి. జగన్ లాగా.. నోటితో ఒకటి చెబుతూ.. చేతల్లో మరో ద్రోహం తలపెట్టే బుద్ధి చంద్రబాబుది కాదని అంటున్నారు. అలాంటి తప్పుడు పనులు చేసేవారిని పాముతో పోల్చడం తప్పుకాదని ప్రజలు అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories