ముహుర్తం ఖరారు అయ్యింది!

మంచు వారి యంగ్ హీరో మంచు విష్ణు హీరోగా పాన్ ఇండియా వైడ్ గా అనేకమంది బిగ్ స్టార్స్ కలయికలో దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “కన్నప్ప” కోసం అందరికీ తెలిసిందే. మరి విష్ణు కెరీర్లోనే భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ఇది కాగా దానితో పాటుగా తన డ్రీం ప్రాజెక్ట్ కూడా ఇదే అని తాను చెబుతున్నాడు. అయితే ఈ సినిమా నుంచి మేకర్స్ అవైటెడ్ టీజర్ కి ఇపుడు టైం ని లాక్ చేసేసారు. మార్చ్ 1న టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు.

అయితే ఇపుడు దీనిని మార్చ్ 1 ఉదయం 11 గంటలకి రానున్నట్టుగా పవర్ఫుల్ పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు. మరి ప్రభాస్, అక్షయ్ కుమార్
, మోహన్ లాల్ లాంటి బిగ్ స్టార్స్ ఈ టీజర్ లో కనిపిస్తారేమో చూడాలి. ఇక ఈ చిత్రానికి స్టీపెన్ డేవస్సి అలాగే మణిశర్మ సంగీతం అందిస్తుండగా మంచు మోహన్ బాబు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సినిమా పాన్ ఇండియా భాషలు సహా ఇంగ్లీష్ లో కూడా ఈ ఏప్రిల్ 25న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories