ఇపుడు కోలీవుడ్ సినిమా నుంచి భారీ హైప్ లో ఉన్న అవైటెడ్ చిత్రాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలయికలో వస్తున్న చిత్రం “కూలీ” కూడా ఒకటి. ఎన్నో అంచనాలు నడుమ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పాన్ ఇండియా లెవెల్లో స్టార్ తారాగణం అయితే ఉన్నారు. ఇక ఈ చిత్రం నుంచి ఆ మధ్య అంతా చాలా మందిని అనౌన్స్ చేసిన మేకర్స్ లేటెస్ట్ గా ఓ ప్రీ లుక్ పోస్టర్ తో ఓ స్టార్ హీరోయిన్ ఉన్నట్టుగా కూడా టీజ్ చేశారు.
అయితే ఆమె బుట్టబొమ్మ పూజా హెగ్డే అనే చాలా మంది భావించారు. మరి ఇపుడు మేకర్స్ అవును మీ గెస్ నిజమే అంటూ పూజా హెగ్డే కూడా కూలీ సినిమాలో ఉన్నట్టుగా ఇపుడు కొత్త పోస్టర్ తో అనౌన్స్ చేశారు. మరి పూజా హెగ్డే ఈ చిత్రంలో కీలక పాత్ర చేస్తుందా లేక స్పెషల్ సాంగ్ చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది.