దిల్ రాజుకు బన్నీ బంపరాఫర్! టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇటీవల బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బాక్సాఫీస్ దగ్గర సందడి చేశాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ ‘గేమ్ ఛేంజర్’తో పాటు.. విక్టరీ వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలతో సంక్రాంతికి సందడి చేశారు ఈ స్టార్ ప్రొడ్యూసర్.
అయితే, గేమ్ ఛేంజర్ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోయినా.. సంక్రాంతికి వస్తున్నాం మూవీ సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా కలెక్షన్స్ రాబట్టడంతో దిల్ రాజు సేఫ్ అయ్యారు. ఇక తన నెక్స్ట్ మూవీ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు ఈ స్టార్ ప్రొడ్యూసర్. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆయనకు ఓ గోల్డెన్ ఛాన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
దిల్ రాజు బ్యానర్‌లో మంచి కథ, దర్శకుడు సెట్ అయితే ఓ సినిమా చేసేందుకు తాను రెడీ అంటూ దిల్ రాజుకి బన్నీ ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లుగా సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ‘పుష్ప-2’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ ఇలా ఓ స్టార్ ప్రొడ్యూసర్‌కి ఓపెన్ ఆఫర్ ఇవ్వడం నిజంగా విశేషమని అభిమానులు అంటున్నారు.