ఈ లాజిక్ కు జవాబు చెప్పే సత్తా ఉందా?

లోతుగా గమనించినప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు జగన్మోహన్ రెడ్డిలో తీవ్రమైన కంగారు మనకు కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం తాము ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతుండడం చూసి ఆయన ఓర్వలేకపోతున్నారు, సహించలేకపోతున్నారు, భయపడిపోతున్నారుకూడా! సూపర్ సిక్స్ హామీలు ఏవీ ఎక్కడ? అంటూ ఓడిపోయిన తొలినాటినుంచి యాగీ చేయడం ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి.. క్రమంగా అవి అమలవుతున్న తీరు చూసి ఆందోలన చెందుతున్నారు. ప్రభుత్వాన్ని ఇక విమర్శించడానికి ఏ కారణమూ లేకుండా పోతోందనేదే ఆయన ఆందోళన! అయితే సూపర్ సిక్స్ హామీల విషయంలో కూడా వైసీపీ చేసిన కుటిల విమర్శలకు కూటమి నాయకులు ఇస్తున్న కౌంటర్లు గట్టిగానే ఉన్నాయి. తల్లికి వందనం పేరుతో చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రులకు ఏటా ఆర్థిక సాయం అందించే పథకం తీసుకువస్తుండగా.. దాని గురించి కూటమి నాయకులు జగన్ ను సూటిగా ప్రశ్నిస్తున్నారు. వారు చెబుతున్న లాజిక్ కు ఆయన వద్ద ఆన్సర్ ఉందో లేదో మరి!

జగన్ తన ప్రభుత్వ కాలంలో అమ్మ ఒడి పేరుతో తల్లులకు నిధులు అందించారు. అయితే అందులో కూడా పాఠశాల నిర్వహణ ఖర్చుల పేరిట కోతపెట్టి మరీ అందించారు. పైగా ఇంట్లో ఇద్దరు పిల్లలున్నా సరే.. ఒక్కరికి మాత్రమే అందించారు. అయితే చంద్రబాబునాయుడు ఈ విషయంలో ఎన్నికల వేళ చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. తల్లులకు పదిహేనువేలు వంతున, ఎలాంటి కోతలు లేకుండా, ఇంట్లో ఎందరు పిల్లలుంటే అందరికీ ఇస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత.. దీనికి సంబంధించిన విధివిధానాల మీద కసరత్తు చేసిన సర్కారు, ఈ ఏడాది మేనెలలో తొలివిడత ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తోంది. అంటే.. 2025-26 విద్యాసంవత్సరం నుంచి అమలవుతోందన్నమాట? మేనుంచి ఇవ్వబోతున్నాం అని పదేపదే చెబుతున్నప్పటికీ కూడా.. వైసీపీ వారు దీని గురించి గోల చేస్తూనే ఉన్నారు. కాగా, ఇప్పుడు కూటమి  నాయకులు అసలు లాజిక్ బయటకు తీస్తున్నారు.

గత ఎన్నికలకుముందు అమ్మఒడిని ప్రకటించిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పటినుంచి అమల్లోకి తెచ్చారు? అనేదే ఆ లాజిక్! అప్పట్లో కూడా జగన్ 2019లో గెలిచి 2020-21 సంవత్సరం నుంచే అమలు చేశారని, ఆయన మాత్రం ఏడాది సమయం తీసుకుని, కూటమి ప్రభుత్వాన్ని ఒకటో నెలలోనే అమలు చేయాలని అడగడంలో అర్థం లేదని అంటున్నారు. చూడబోతే జగన్ వ్యవహార సరళి కళ్లు మూసుకుని పాలు తాగే పిల్లి చందంగా ఉన్నది. తాను చేసిన తప్పులు ఎవ్వరూ గుర్తించరు లే అనుకున్న జగన్.. కూటమి ప్రభుత్వాన్ని మాత్రం నిందిస్తూ సాగడం నవ్వులపాలు అవుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories