న్యాచురల్ స్టార్ నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘దసరా’ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించారు. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల ఓవర్‌నైట్‌లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్‌గా మారిపోయాడు. ఇక తన నెక్స్ట్ చిత్రాన్ని కూడా నానితో స్టార్ట్ చేశాడు ఈ యంగ్ డైరెక్టర్. ‘ది ప్యారడైజ్’ అనే టైటిల్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. అయితే, ‘ది పారడైజ్’ నుంచి అప్డేట్ వచ్చింది. నాని పుట్టిన రోజు సందర్భంగా ‘RAW STATEMENT’ పేరుతో మార్చి 3న స్పెషల్ వీడియో లేదా ఫొటోను విడుదల చేస్తామని చిత్ర బృందం తాజాగా ప్రకటించింది
పక్కా యాక్షన్ ఎలిమెంట్స్ తో రాబోతున్న ఈ సినిమాలో మాస్ కి ఫుల్ మీల్స్ లా ఉంటుందట సినిమా. అన్నట్టు ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిర సినిమాస్ ‘ది ప్యారడైజ్’ చిత్ర ఓవర్సీస్ రైట్స్‌ను భారీ డీల్‌కు దక్కించుకున్నట్లు వార్తలు వచ్చాయి. పైగా నాని కెరీర్‌లో ఇది హయ్యెస్ట్ ఓవర్సీస్ డీల్ అని టాక్. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటించే కథానాయికను ఇంకా ప్రకటించలేదు. కాగా ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.