ఈసారి అసలు తగ్గేదేలే

ఈసారి అసలు తగ్గేదేలే టాలీవుడ్ యువత ఎంతగానో మెచ్చిన రీసెంట్ గా వచ్చిన సాలిడ్ హిట్ చిత్రం “మ్యాడ్” కూడా ఒకటి. దర్శకుడు కళ్యాణ్ శంకర్ యంగ్ హీరోస్ నార్నె నితిన్, సంగీత్ శోభన్ అలాగే రామ్ నితిన్ ల కలయికలో చేసిన ఆ సినిమా భారీ హిట్ కాగా ఇపుడు దీనికి సీక్వెల్ గా “మ్యాడ్ స్క్వేర్”ని ఇపుడు తీసుకొస్తున్నారు. 

అయితే ఈ సినిమా నుంచి మేకర్స్ అవైటెడ్ టీజర్ ని రిలీజ్ చేయగా ఈ టీజర్ మాత్రం ఎంటర్టైన్మెంట్ పరంగా అస్సలు తగ్గేదేలే అనే రేంజ్ లో ఉందని చెప్పాలి. ఫస్ట్ పార్ట్ కంటే బెటర్ గా ఇందులో కామెడి ఉన్నట్టు క్లియర్ గా అనిపిస్తుంది. ఇక స్టార్ట్ అయ్యిన మొదటి సెకండ్ నుంచి ఎండింగ్ వరకు కూడా నాన్ స్టాప్ కామెడీతో టీజర్ ఉందని చెప్పవచ్చు. 

తమ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్లి రచ్చ చేసే ముగ్గురు బాయ్స్.. అక్కడ నుంచి గోవా జర్నీలో నడిచే రచ్చ అంతా క్రేజీ లెవెల్లో దర్శకుడు ప్లాన్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇక భీమ్స్ మ్యూజిక్ కూడా మళ్ళీ బిగ్గెస్ట్ హైలైట్ గా కనిపిస్తుండగా నిర్మాతలుకి ఈసారి కూడా కాసుల పంటే అనేలా ఉంది. మరి ఈ అవైటెడ్ సీక్వెల్ ఈ మార్చ్ 29న గ్రాండ్ గా రిలీజ్ చేస్తుండగా ఈ చిత్రం ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి. 

Related Posts

Comments

spot_img

Recent Stories