ప్రస్తుతం మన సౌత్ లో ఉన్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ హీరోస్ లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ కూడా ఒకరు. మరి మన టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి బాహుబలి సినిమాలతో ఎలాంటి ఫేమ్ వచ్చిందో యష్ కి కూడా పాన్ ఇండియా లెవెల్లో కేజీయఫ్ చిత్రాలతో మాసివ్ క్రేజ్ వచ్చింది.
అయితే బాహుబలి చిత్రాలు తర్వాత ప్రభాస్ కి నెక్స్ట్ సినిమా పెద్ద తలనొప్పి అయితే యష్ కి కూడా కేజీయఫ్ సినిమాలు అనంతరం అలాంటి పరిస్థితే నెలకొంది. అయితే ఇలాంటి హైప్ నడుమ యష్ నుంచి అనౌన్స్ అయ్యిన చిత్రమే “టాక్సిక్”. అయితే మన ఇండియన్ సినిమా నుంచి హాలీవుడ్ లోకి రిలీజ్ అయ్యిన సినిమాలు దాదాపు చాలా తక్కువే కనిపిస్తాయి. గత ఏడాది ప్రభాస్ కల్కి ఈ ఫీట్ అందుకుంటుంది అని చాలా మంది అనుకున్నారు కానీ కుదరలేదు.
కానీ ఇపుడు యష్ టాక్సిక్ మాత్రం హాలీవుడ్ రిలీజ్ అవుతుంది అని తెలుస్తుంది. ఎందుకంటే మేకర్స్ ఈ సినిమాని తెరకెక్కిస్తుండడమే కన్నడ సహా ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారట. దీనితో ఈ రెండు భాషల్లోనూ టాక్సిక్ రిలీజ్ కానుంది అని తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుండగా ఈ ఏడాది ఎండింగ్ కి రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్.