నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన రీసెంట్ సినిమాలు వరుసగా సాలిడ్ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలు తర్వాత తను చేస్తున్న మరో అవైటెడ్ సినిమానే హిట్ 3. తను పరిచయం చేసిన యువ దర్శకుడు శైలేష్ కొలను కాంబినేషన్ లో చేస్తున్న ఈ సినిమా పట్ల మొదటి నుంచి కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
కానీ ఇపుడు లేటెస్ట్ గా వచ్చిన టీజర్ తర్వాత మాత్రం ఇవన్నీ ఒక్కసారిగా పెరిగిపోయాయి అని చెప్పాలి. ఊహించని లెవెల్లో మేకర్స్ ఈ టీజర్ ని కట్ చెయ్యడం మెయిన్ గా నాని ఆశ్చర్య పరచడం ఇందుకు ప్రధాన కారణం అని చెప్పవచ్చు. దీనితో ఈ సినిమా కోసం మాత్రం అభిమానులు న్యూట్రల్ ఆడియెన్స్ కూడా ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు.