రామాయణం సెట్‌ రావణుడు!

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, లేడీ పవర్‌ స్టార్‌ సాయి పల్లవి సీతగా బాలీవుడ్ డైరెక్టర్‌ నితేష్ తివారీ రామాయణ్ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. రావణుడిగా కన్నడ స్టార్ హీరో యష్ యాక్ట్ చేస్తున్నారు. కాగా తాజాగా యష్ రామాయణం షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. రావణుడి పాత్ర పోషించడం కోసం ముంబైలో షూటింగ్ స్టార్ట్ చేశాడు యష్. రెండు రోజుల డ్రెస్ రిహార్సల్స్ తర్వాత, యష్ ఫిబ్రవరి 21, 2025న తన సన్నివేశాల షూటింగ్ స్టార్ట్ చేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ షెడ్యూల్ ల్లో ఓ భారీ యుద్ధ సన్నివేశాల చిత్రీకరిస్తున్నారట. ప్రస్తుత షెడ్యూల్ ముగిశాక, తదుపరి షెడ్యూల్ షూటింగ్ కోసం దహిసర్‌లోని ఒక స్టూడియోకు వెళ్లనుంది టీమ్.

దర్శకుడు నితేష్ తివారీ రామాయణం రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగాన్ని 2026 దీపావళికి గ్రాండ్ గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే రెండవ భాగం 2027 దీపావళి కానుకగా  థియేటర్లలో సందడి చేస్తుందని సమాచారం. ఈ సినిమా పై పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. ఎలాగూ పవిత్ర ఇతిహాసం రామాయణం ఆధారంగా రాబోతుంది కాబట్టి, అన్ని వర్గాల్లోనూ ఆసక్తి ఉంది.

Related Posts

Comments

spot_img

Recent Stories