కుస్తీకి సిద్ధమవుతున్న చరణ్‌!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్’ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్‌ లో రాబోతున్న ‘ఆర్ సి 16’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా తాజాగా హైదరాబాద్‌లో ఓ కీలక షెడ్యూల్‌ పూర్తి చేసుకున్నట్లు తెలిసింది. దీనిలో భాగంగా చరణ్‌ – దివ్యేందులపై క్రికెట్‌ నేపథ్య సన్నివేశాలను షూట్ చేశారు. ఇక, తదుపరి షెడ్యూల్‌ మార్చి తొలి వారం నుంచి దిల్లీలో స్టార్ట్ చేయనున్నారు. ఆ షెడ్యూల్‌లో రామ్‌చరణ్‌తో పాటు ప్రధాన తారాగణంపై కుస్తీ నేపథ్య సన్నివేశాలు చిత్రీకరించనునున్నారు.

అన్నట్టు కథ రీత్యా ఈ సినిమాలో క్రికెట్, కుస్తీతో పాటు మరికొన్ని ఆటలకు ప్రాధాన్యముంది. చరణ్‌ దీంట్లో అందర్నీ ఆశ్చర్యపరిచేలా ఓ కొత్త క్యారెక్టరైజేషన్‌లో కనిపించబోతున్నాడు.  ఈ సినిమాకి ‘పెద్ది’ అనే పేరుతో పాటు మరో రెండు టైటిల్స్‌ పరిశీలనలో ఉన్నాయి. మార్చి 27న రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌ టీజర్‌ రిలీజ్ చేయనున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories