ఏం ఉన్నావ్ అన్న! టాలీవుడ్ లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ మాస్ హీరోస్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా ఒకరు. మరి “దేవర” భారీ సక్సెస్ తర్వాత తారక్ సాలిడ్ లైనప్ తో సిద్ధంగా ఉండగా వీటిలో రీసెంట్ గానే దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా కూడా స్టార్ట్ అయ్యింది. అయితే ఈ చిత్రం షూట్ ప్రస్తుతం తారక్ లేని సన్నివేశాలతో జరుగుతుండగా తారక్ ఓ పెళ్ళికి హాజరు కావడం జరిగింది. అయితే లేటెస్ట్ గా తన నుంచి వచ్చిన కొన్ని పిక్స్ ఇపుడు ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తున్నాయి. బ్లాక్ సూట్ లో మంచి స్టైలిష్ లుక్స్ లో ఎన్టీఆర్ చితక్కొట్టేసాడు అనే రేంజ్ లో మంచి డైనమిక్ ప్రెజెన్స్ తో కనిపిస్తున్నాడు. దీనితో ఈ ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి. ఇక నీల్ తో పాటుగా వార్ 2 అనే భారీ సినిమా కూడా తాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే రానుంది.