టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో యువ నటుడు మన తెలుగు సినిమా మొట్ట మొదటి సూపర్ హీరో హను మాన్ తేజ సజ్జ కూడా ఒకరు. మరి తేజ సజ్జ హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో మాస్ మహారాజ రవితేజతో “ఈగల్” అనే సాలిడ్ యాక్షన్ సినిమా తీసిన యంగ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనితో చేస్తున్న వరల్డ్ క్లాస్ చిత్రమే “మిరాయ్”.
మరి మొదటి నుంచి మంచి బజ్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ ఏడాది ఏప్రిల్ కి లాక్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇపుడు ఇక్కడ నుంచి సినిమా వాయిదా వేసి కొత్త డేట్ ని మేకర్స్ అందించారు. ఈ ఆగస్ట్ 1న సినిమా పాన్ వరల్డ్ భాషల్లోనే గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నట్టుగా ఇపుడు సాలిడ్ పోస్టర్ తో కన్ఫర్మ్ చేశారు.
మరి ఈ సాలిడ్ ప్రాజెక్ట్ ఎలాంటి ట్రీట్ ఇస్తుందో తెలియాలి అంటే అప్పుడు వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రంలో మంచు మనోజ్ నెగిటివ్ రోల్ లో నటిస్తుండగా హను మాన్ సంగీత దర్శకుడు గౌర హరీష్ నే ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నాడు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.