హక్కులన్నీ వారివే!

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “కింగ్డమ్” కోసం అందరికీ తెలిసిందే. మరి రీసెంట్ టీజర్ గ్లింప్స్ తో సాలిడ్ హైప్ అందుకున్న ఈ సినిమాకి సంగీతం అనిరుద్ ఇస్తున్నాడని తెలిసిందే. సగం హైప్ ఇక్కడే సినిమాకి సొంతం కావడం విశేషం. అయితే తన నుంచి వచ్చే పాటలు వినేందుకు కూడా చాలా మంది ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు.

మరి ఈ సినిమా తాలూకా ఆడియో హక్కులకు సంబంధించి ఇపుడు అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా ఆడియో హక్కులని ప్రముఖ ఆడియో లేబుల్ ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నట్టుగా లేటెస్ట్ గా రివీల్ చేశారు. సో ఇక నుంచి కింగ్డమ్ బీట్స్ అన్నీ ఆదిత్య మ్యూజిక్ నుంచి వినవచ్చు అని చెప్పాలి. ఇక ఈ సినిమాని కూడా మేకర్స్ రెండు భాగాలుగా ప్లాన్ చేస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories