వామ్మో పోటీ మామూలుగా లేదుగా!

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇపుడు చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలయికలో తెరకెక్కిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రం “కూలీ” కూడా ఒకటి. అయితే ఈ సినిమాపై తమిళ నాట మాత్రమే కాకుండా తెలుగు సహా ఇతర భాషల్లో కూడా సాలిడ్ హైప్ నెలకొంది. దీనితో కోలీవుడ్ నుంచి మొదటి 1000 కోట్ల సినిమా కూడా ఇదే అవుతుంది అనే బజ్ ఈ సినిమా విషయంలో ఉంది.

అయితే ఇలాంటి సినిమాకి ఓటిటి డీల్ కూడా భారీ జరుగుతుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి ఇలానే కూలీ కోసం రెండు టాప్ ఓటిటి సంస్థలు భారీ ధరలతో పోటాపోటీగా ముందు రేస్ లో ఉన్నాయట. అమెజాన్ ప్రైమ్ వీడియో అలాగే, నెట్ ఫ్లిక్స్ లు ఈ సినిమాని దక్కించుకోవాలని ముందు వరుసలో చూస్తున్నాయట. మరి వీరిలో ఎవరు ఈ భారీ ప్రాజెక్ట్ ని సొంతం చేసుకుంటారో వేచి చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories