క్రేజీ పిక్‌..సాలిడ్‌ అప్డేట్!

ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న పలు చిత్రాల్లో భారీ హైప్ ఉన్న కాంబినేషన్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమా కూడా అని చెప్పాలి. మరి ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఎగ్జైటెడ్ గా కూడా ఉన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యినట్టుగా టాక్ సినీ వర్గాల్లో ఉంది. ఎన్టీఆర్ లేకుండా ఏకంగా 3000 మంది జూనియర్ ఆర్టిస్ట్ లతో ప్రశాంత్ నీల్ ఓ భారీ యాక్షన్ సీన్ తో సినిమా స్టార్ట్ చేసినట్టుగా టాక్ వచ్చింది.

అయితే ఇపుడు దీనిపై మేకర్స్ అఫీషియల్ అప్డేట్ ఇచ్చేసారు. నీల్ పై సెట్స్ లో అంతమంది జూనియర్ సమూహంని కంట్రోల్ చేస్తున్నమాస్ పిక్ ని పోస్ట్ చేసి సినిమా మొదలైనట్టు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. సో మొత్తానికి ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ మొదలైంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ వహిస్తున్న సంగతి తెలిసిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories