పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇపుడు చేస్తున్న లేటెస్ట్ సినిమాల్లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమా హరిహర వీరమల్లు కూడా ఒకటి. మరి దీనిపై కూడా మంచి అంచనాలు నెలకొనగా ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆల్రెడీ వచ్చిన మొదటి సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.
ఇక రెండో సాంగ్ గా కొల్లగొట్టిందిరో అంటూ అనౌన్స్ చేసిన సాంగ్ పై కూడా మంచి బజ్ నెలకొనగా ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ ఛాయిస్ ని అభిమానులకే టీమ్ వదిలేశారు. దీనితో ఈ ఫిబ్రవరి 21 లేదా 22 డేట్స్ ఇస్తే ఎక్కువ 21 మధ్యాహ్నం 3 గంటలకే పడుతున్నాయి. సో ఫ్యాన్స్ ఫిక్స్ చేసిన డేట్ సమయానికే ఈ సాంగ్ రానుంది అని చెప్పవచ్చు. ఇక ఈ ఫుల్ సాంగ్ ఈ 24న రానుంది. అలాగే ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.