వారిద్దరి మధ్యే… !

ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా కోసం అందరికీ తెలిసిందే. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లో 16వ సినిమాగా తెరకెక్కిస్తుండగా ఆడియెన్స్ ఈ సినిమా కోసం చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.

అయితే వీరి ఎగ్జైట్మెంట్ కి తగ్గట్టుగా సాలిడ్ తారగణంతో బుచ్చిబాబు ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా పాన్ ఇండియా ఓటీటీ ఫేవరేట్ మున్నా భయ్యా దివ్యెందు శర్మ కూడా యాడ్ కావడంతో మరింత ఎగ్జైట్ అవుతున్నారు అభిమానులు. అయితే ఈ సినిమాలో ప్రస్తుతం ఈ నటుడు, రామ్ చరణ్ నడుమ సాలిడ్ క్రికెట్ సీక్వెన్స్ ని బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నాడట.

మంచి పవర్ క్రికెట్ ఎపిసోడ్ గా సినిమాలో ఇది ఉంటుంది అని తెలుస్తోంది. మరి సే సీన్ సినిమాలో ఏ రేంజ్ లో ఉంటుందో చూడల్సిందే. ఇక ఈ భారీ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు అలాగే వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories