పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఆయన నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’తో పాటు డైరెక్టర్ హరీష్ శంకర్‌తో కలిసి చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై కూడా సాలిడ్ అంచనాలు పెరిగాయి. ఇక హరీష్ శంకర్‌తో ‘గబ్బర్ సింగ్’ తర్వాత మరో పోలీస్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా చూడటమే కాకుండా, అభిమానులు ఊహించని విధంగా ఆయన పాత్ర ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాలో ఓ కారు సీన్ ఉంటుందని.. అందులో పవన్ కారు పై కూర్చుని వెళ్లడం.. నిజ జీవితంలో పవన్ వాహనంపై వెళ్లిన సీన్‌కు దగ్గరగా ఉంటుందని హరీష్ చెప్పుకొచ్చాడు.
ఈ వార్తతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ ‘ఒక్క’ ఎపిసోడ్‌ను సినిమాకే హైలైట్‌గా వచ్చేలా చేయాలంటూ కామెంట్లు పెడుతున్నారు. రియల్ లైఫ్‌లోనూ ఈ ‘ఒక్క’ సీన్ వల్ల రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పు వచ్చిందని.. ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలకావాలంటే ఈ సీన్ పవర్‌ఫుల్‌గా రావాలంటూ వారు చిత్ర యూనిట్‌ను కోరుతున్నారు.