బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘వార్-2’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌తో పాటు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు డబుల్ అయ్యాయి. ఇక ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
అయితే, ఇటీవల భారీ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరుపుకున్న ‘వార్-2’లో ఇప్పుడు హీరోల మధ్య డ్యాన్స్ వార్ జరగనుందని తెలుస్తోంది. ఈ సినిమాలోని ఓ డ్యాన్స్ నెంబర్ సాంగ్ షూట్‌కు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. ఫిబ్రవరి నెలాఖరున ఈ సాంగ్ షూటింగ్ జరగబోతుందని బి టౌన్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక డ్యాన్స్‌లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరికీ అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది. దీంతో ఇప్పుడు ఇద్దరు బెస్ట్ డ్యాన్సర్లు పోటీ పడితే ఎలా ఉండబోతుందో ‘వార్-2’లో చూడబోతున్నాం అని అభిమానులు అంటున్నారు. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది.